బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

 దిల్‌ రాజు చేతుల విూదుగా లెజెండరీ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా  జులై1,(ఇయ్యాల తెలంగాణ ):

లెజండరీ డైరెక్టర్‌ శంకర్‌ ప్రొడక్షన్స్‌ అయిన ఎస్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్‌ మాల్‌ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్‌ శంకర్‌ ప్రొడక్షన్‌ లో మొదటి సారి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌ చిత్రాన్ని నిర్మించారు. షాపింగ్‌ మాల్‌, ఏకవీర తదితర సెన్సిబుల్‌ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్‌ దాస్‌ హీరోగా, దుసరా విజయన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌ ట్విట్టర్‌ వేదికగా దిల్‌ రాజు విడుదల చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జూలై 21న విడుదలకానుంది. తెలుగులో ఎస్‌.ఆర్‌ డి.ఎస్‌ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్‌ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుందని దర్శకుడు వసంతబాలన్‌ చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో వనితా విజయ్‌ కుమార్‌, అర్జున్‌ చిదంబరం, సురేష్‌ చక్రవర్తి తదితరు
లు నటించారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....