బ్రాండెడ్‌ బీర్ల కోసం క్రేజీ! స్టాక్ లేవంటూ దాచేస్తున్న మద్యం వ్యాపారులు

జోరుగా సాగుతున్న మద్యం అమ్మకాలు

కావాలనే అమ్మడం లేదని ఆరోపణలు


పాతనగరంలోని మద్యం షాపుల ముందు కానరాని మద్యం రేట్ల పట్టిక

హైదరాబాద్‌,మే13(ఇయ్యాల తెలంగాణ ): జిల్లాల్లో మద్యం అమ్మకాలు  జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వానికి  కూడా ఆదాయం భారీగానే వస్తోంది. అయితే సామాన్యులకు మాత్రం ఇది ఆర్థికంగా దెబ్బతీసేలా ఉంది. కాయకష్టం చేసుకుని బతుకుతున్న వారు పనులు  లేకపోయినా ఇప్పుడు తాగుడు మాత్రం ఆపడం లేదు. దీంతో సామాన్యుల  జీవితాలకు ఇదో సమస్యగా మారనుంది. మరోవైపు మద్యం ధరలు  కూడా భారీగా పెరిగాయి. ఈనెల  6 నుంచి మద్యం దుకాణాలు  తెరుచుకోగా, వారం రోజుల్లోనే రూ.900 కోట్ల ఆదాయం వచ్చింది. మామూలు  రోజుల  కంటే రెట్టింపు స్థాయిలో విక్రయాలు  సాగుతున్నాయి.

మద్యం దుకాణాల వద్ద ఇప్పటికీ మందుబాబులు  బారులు  తీరుతున్నారు. మళ్లీ దుకాణాలు  మూత పడుతాయని ముందు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు  చేస్తున్నారు. ªుపో నుంచి వ్యాపారులు  కొనుగోలు  చేసిన సరుకుల  ఆధారంగా ఆ రోజు విక్రయాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం పెంచిన కొత్త ధర ప్రకారం విక్రయాలు  జరుపు కోవచ్చని ఎక్సైజ్‌ అధికారులు  పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు  మూసి వేయగా అక్రమంగా ఐఎంఎల్‌ లిక్కర్‌ను దొడ్డిదారిన వ్యాపారులు  విక్రయించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం వేసవి కావడంతో మందుబాబులు  బీరు తాగేందుకు ఆసక్తి చూపుతారు. అయితే వారు డిమాండ్‌ చేస్తున్న బ్రాండ్‌ బీర్లు జిల్లాల్లో ఎక్కడ దొరకడం లేదంటున్నారు. వ్యాపారులు  సిండికెట్‌ అయి ఇతర బ్రాండ్‌ బీర్లను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు  వ్యక్త మవుతున్నాయి. ఇతర బ్రాండ్‌ బీరుల  కేసులపై అదనంగా రూ.30 కవిూషన్‌ వస్తోంది. ఈ అక్రమ వ్యవహారాన్ని లిక్కర్‌ కింగ్‌లు  బాగానే మేనేజ్‌  చేశారు. మార్చి 23 నుంచి మే 5 వరకు మద్యం దుకాణాలు  దాదాపు 45 రోజు పాటు మూతపడి ఉండటంతో డిమాండ్‌ మరింత పెరిగింది. ప్రస్తుత అమ్మకాలను  బట్టి చూస్తే రికార్డు స్థాయిలో లిక్కర్‌ విక్రయాలు  జరుగుతున్నట్టు  తెలుస్తుంది.

ఇకపోతే ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రతి మద్యం షాపు వద్ద పెరిగిన మద్యం ధర పట్టిక విధిగా ఉండాలి. ఏ బ్రాండు మద్యం ఎంతకు విక్రయిస్తున్నారో ధర పట్టికలో సూచించాల్సి ఉన్నా ఈ నిబంధన అనేక చోట్ల అములుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఒక్కో క్వార్టర్‌ మద్యంపై కనీసం రూ.పది నుంచి రూ.15 వరకు అదనంగా వసూలు  చేస్తున్నారు  అధికారులు  పట్టించుకున్న దాఖలాలు  లేవు. ప్రతి బీరుపై ఎంఆర్‌పీ కన్నా రూ.పదికి అదనంగా విక్రయిస్తున్నారు. దీంతో  మద్యంప్రియుల  జేబుకు చిల్లు  పడుతోంది. అలాగే ఖరీదైన మద్యం బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ.30 చొప్పన అదనంగా విక్రయిస్తున్నారు. ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు  ఈ ఏడాది నమోదువుతుండటంతో మద్యంప్రియులు  బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీటి అమ్మకాలు  బాగా పెరిగాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు  అమాంతం పెరగడంతో బీర్లకు డిమాండ్‌ పెరిగింది.
ఎండను బట్టి జూన్‌, జూలైలోనూ ఈ అమ్మకాలు  తార స్థాయిలోనే ఉంటాయి.  ఈ లెక్కన చూస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు ఒక్కో జిల్లా నుంచి అదనంగా రూ.200కోట్ల ఆదాయం పెరగనుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....