బ్యాంక్‌ ను ముట్టడిరచిన ద్వాక్రా మహిళలు

  

ఏలూరు జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):యూనియన్‌ బ్యాంకులో డ్వాక్రా మహిళల సొమ్ము బిజినెస్‌ కరస్పాండెంట్‌ స్వాహా చేయడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుని ముట్టడిరఓఇఐఎ. ఆగిరిపల్లి మండలం సగ్గూరు, నర్శింగపాలెం,తోటపల్లి గ్రామాల్లో రూ.1కోటి 10 లక్షల  డ్వాక్రా సంఘాల సొమ్మును యూనియన్‌ బ్యాంకు బి.సి.(బిజినెస్‌ కరస్పాండెంట్‌) స్వాహా చేసినట్లు ఆరోపణ.బాధిత డ్వాక్రా సంఘాల మహిళలతో కలసి ఆగిరిపల్లి యూనియన్‌ బ్యాంక్‌ ని  ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు ముట్టడిరచారు. మూడు గ్రామాల్లో రూ.కోటి రూపాయలకు పైగా డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా జరిగినట్లు నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు తో యూనియన్‌ బ్యాంక్‌ ఏ.జి.ఎం. హరీష్‌ చర్చలు జరిపారు. ఈ నేపధ్కంలో పోలీసులు బ్యాంకు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. పది రోజుల్లో  స్వాహా అయిన సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేస్తామని బ్యాంక్‌ ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా హావిూ ఇచ్చారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....