ఏలూరు జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):యూనియన్ బ్యాంకులో డ్వాక్రా మహిళల సొమ్ము బిజినెస్ కరస్పాండెంట్ స్వాహా చేయడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుని ముట్టడిరఓఇఐఎ. ఆగిరిపల్లి మండలం సగ్గూరు, నర్శింగపాలెం,తోటపల్లి గ్రామాల్లో రూ.1కోటి 10 లక్షల డ్వాక్రా సంఘాల సొమ్మును యూనియన్ బ్యాంకు బి.సి.(బిజినెస్ కరస్పాండెంట్) స్వాహా చేసినట్లు ఆరోపణ.బాధిత డ్వాక్రా సంఘాల మహిళలతో కలసి ఆగిరిపల్లి యూనియన్ బ్యాంక్ ని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ముట్టడిరచారు. మూడు గ్రామాల్లో రూ.కోటి రూపాయలకు పైగా డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా జరిగినట్లు నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తో యూనియన్ బ్యాంక్ ఏ.జి.ఎం. హరీష్ చర్చలు జరిపారు. ఈ నేపధ్కంలో పోలీసులు బ్యాంకు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. పది రోజుల్లో స్వాహా అయిన సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేస్తామని బ్యాంక్ ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా హావిూ ఇచ్చారు

.jpeg)