చార్మినార్, జులై 13 (ఇయ్యాల తెలంగాణ) : బోనాల వేడుకలకు పాతనగర రోడ్లకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. గుంతల మయమైన రోడ్లపై జిహెచ్ఎంసి అధికారులు ప్యాచ్ లను వేస్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేస్తున్నారు. ప్రధాన రహదార్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిత్యం రోడ్ల మరమ్మతులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎక్కడ కూడా ప్యాచ్ లు కనిపించకుండా గుంతల మయమైన రోడ్లన్నీ మరమ్మతులవుతున్నాయి. ఒక పక్క బోనాలు సమీపిస్తుండడంతో అధికారులు అఘమేఘాల మీద రోడ్లకు మెరుగులు దిద్దుతున్నారు.
శానిటేషన్ భేష్ :
శానిటేషన్ అధికారులు కూడా పండుగ నేసథ్యంలో ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి సిబ్బందితో కలసి రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు. ఎక్కడ కూడా చెత్తా చెదారం లేకుండా చూస్తున్నారు. శానిటేషన్ వర్కర్ లు ఉదయం సాయంత్రం రెండు పూటలా రోడ్లను శుభ్రపరుస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో కూడా తీరిక లేకుండా పని చేస్తున్నారు. బోనాల జాతరలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడడమే తమ వంతు పూర్తి భాద్యతగా అధికారులు చెబుతున్నారు.