బోగస్‌ ల ఏరివేతకు LPG కస్టమర్ల ఆధార్‌ EKYC

 

న్యూఢల్లీ జూలై 11 (ఇయ్యాల తెలంగాణ ); ఎల్‌ పిజి కస్టమర్లలో బోగస్‌ వినియోగదారుల ఏరివేతకు ఆధార్‌ ఆధారిత ఈకెవైసి నిర్వహిస్తున్నామని ఆయిల్‌ మినిష్టర్‌ హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. చాలా మంది బోగస్‌ వినియోగదారులు తమ పేరిట వంట గ్యాస్‌ ను బుక్‌ చేసుకున్నా అది కమర్షియల్‌  దుకాణాలకు మళ్లించడం జరుగుతోందని వివరించారు. ఇంటికి వాడే ఎల్‌ పిజి 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 803(కేజికి రూ. 56.5 చొప్పున) కాగా, హోటళ్లు, రెస్టారెంట్‌ లు వాడే 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ. 1646(కిలోకి రూ. 86.3 చొప్పున) గా ఉంది.ఇప్పుడు బోగస్‌ వినియోగదారులకు ఆధార్‌ అనుసంధానిత ఈకెవైసి తప్పనిసరి అని మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ‘ఎక్స్‌’ పోస్ట్‌ లో పెట్టారు. ఇక ఎనిమిది నెలలో ఈ ప్రక్రియ జరిగిపోతుంది.చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ విభాగం ప్రకారం ఇండియాలో 32.64 కోట్ల ఎల్‌ పిజి వినియోగదారులు క్రియాశీలంగా ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....