బెంగాల్‌ Train ప్రమాదంలో 10కి చేరిన మృతులు

బెంగాల్‌, జూన్‌ 17, (ఇయ్యాల తెలంగాణ) : పశ్చిమబెంగాల్‌ లో ఘోర రైలు  ప్రమాదం సంభవించింది. గూడ్స్‌ రైలు కాంచన జంగ ఎక్స్‌ ప్రెస్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని ప్రాథమికంగా అధికారులు వెల్లడిరచారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. డార్జిలింగ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసోంలోని సిల్చార్‌ నుంచి వస్తున్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని రంగపాని స్టేషన్‌ వద్ద గూడ్స్‌ ట్రైన్‌ ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడం వల్ల బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన రెండు కోచ్‌లు అదుపు తప్పాయి. ఈ ఘటనపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడిరచారు. ప్రమాద ధాటికి బోగీలు చెల్లాచెదురయ్యాయి. అయితే…ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెడ్‌ సిగ్నల్‌ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. 

దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ఈ ఘటనగ్భ్భ్రాంతి కలిగించిందని వెల్లడిరచారు. రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయని తెలిపారు. రైల్వేతో పాటు ఔఆఖీఈ,ూఆఖీఈ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఎమర్జెన్సీ మెడికల్‌ టీమ్‌ అందుబాటులోకి వచ్చింది. వేగంగా బాధితులను హాస్పిటల్‌కి తరలిస్తోంది. మార్గ మధ్యలోనే అవసరమైన చికిత్స అందిస్తోంది. ఇక రైల్వే అధికారులు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. సాయం కావాల్సిన వాళ్లు హెల్ప్‌లైన్‌ నంబర్‌లకు కాల్‌ చేయాలని వెల్లడిరచారు. నైహతి స్టేషన్‌ వద్ద మరో స్పెషల్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....