బెంగళూరు వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు ను పుట్టపర్తి లో ఆపాలి

    రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్‌ ను కోరిన  ఎన్‌ వి ఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌               

న్యూ డిల్లీ ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ):  సమ్మతం తెలియజేసిన మంత్రి

కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్‌ ను  పార్లమెంట్‌ కార్యాలయంలో ఉప్పల్‌ బిజెపి మాజీ శాసనసభ్యులు ఎన్‌ వి ఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌ కలిసారు. ఈ సందర్భంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌  పనులు  చాలా వేగంగా జరుగుతున్నాయని రాబోయే రెండు మాసములలో అవి పూర్తి అవుతాయని మంత్రి  తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద చర్లపల్లి టెర్మినల్‌.  దీని ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ  వస్తారు అని   రైల్వే మంత్రి గారు హావిూ ఇచ్చినట్లు   ఉప్పల్‌ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్‌ తెలిపారు.  సికింద్రాబాద్‌  బెంగళూరు వందే భారత్‌  ఎక్స్‌ ప్రెస్‌ రైలు ను పుట్టపర్తి లో ఆపాలని  శ్రీ సత్యసాయిబాబా భక్తులు కోరుతున్నారని  రైల్వే మంత్రిగారికి తెలియజేసిన పిమ్మట అందుకు మంత్రి  సమ్మతం తెలియజేసినట్లు ప్రభాకర్‌ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....