ఖమ్మం జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విూడియాతో మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన తెలంగాణ జనగర్జన సభకు హాజరైన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభిమానులందరికి కృతజ్ఞతలు. 27న మేము రాహుల్ గాంధీని కలిశాం. కేవలం 5 రోజుల్లో జనగర్జన సభ ఏర్పాట్లు చేశాం. కొందరు నాయకులు అభిమానులు అజ్ఞాతంలో ఉండి పని చేశారు. ఈ సభ విజయానికి రహస్యమేవిూ లేదు. గడిచిన 4 ఏళ్ళుగా నాకు అధికారం లేకపోయినా నేను ప్రజలతో మమేకమైనాను. దానితో ప్రజలు వారి ప్రేమ అనురాగం ఆప్యాతలు నాపై చూపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనీ శ్రేణులు నాయకులు కలిసి పని చేయబట్టే ఆ సభ అంతలా జరిగిందని అన్నారు. గతంలో అధికార ప్రతి పక్ష పార్టీలు పెట్టిన సభలు చూసారు. వాటిలో ఏ సభ విజయవంతం అయిందో ప్రజలకు తెలుసు. సభ ఏ విధంగా జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ వచ్చిన నాటి నుండి ఎంత అభిమానం ఉందో అభిమానుల జోష్ తో తెలిసిపోతుంది. సభ జరగక ముందే చెప్పా విూ సభ జరిగిన దాని కంటే ఎక్కువమందితో సభ నిర్వహిస్తామని వారికి సభ లో ప్రజలు కనిపించకుంటే వారు పెట్టిన సంక్షేమ పథకం కంటి వెలుగులో చూపించుకొండి. నా కూతురి వివాహానికి నాగార్జున సాగర్ కాలువపై ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జి గురించి తీసివేయాలి ఆదేశించారు. దానిపై మేము కోర్ట్ కి వెళ్లి స్టే తీసుకుని వచ్చాం. రవాణా కోసం ఆర్టీసి బస్సులు కోసం అధికారులను సంప్రదిస్తే ఆ బస్సులను ఆపారు. జూల్లురుపాడులో సుమారు 200 డీసీఎం ట్రక్ లు నిలిపివేశారు. ఆర్టీవోతో మాట్లాడితే ఆయన డీసీఎంలలో ప్రజా రవాణా చేయకూడదు అంటున్నారు. అంత పెద్ద సభలో లక్షల మంది ప్రజలు వస్తె పోలీసులు రక్షణ కల్పించలేదు. అభిమానులు బారికేడ్లను నెట్టి సభ స్టేజ్ వద్దకు వచ్చారంటే పోలీసుల వైఫల్యం ఎంటో అర్థమవుతుంది. నిన్న జరగరాని ఘటన జరిగి ఉంటే దానికి బాధ్యులు ఎవరు. సీఎం కెసీఆర్ కాదా తెలంగాణ డిజిపి కాదా పోలీస్ వ్యవస్థ కాదా. చివరికి నీతి మాలిన పని మంచి నీటిని నిలిపివేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నీఛాతి నీచంగా దిగజారింది. గిరిజనుల విూద రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నడూ లేనివిధంగా ప్రేమ నిన్ననే ఒలకబోశారు. పోడు పట్టాలు నిన్న కాకుంటే ఇంకెప్పుడు ఇవ్వమని భయ భ్రాంతులకు గురి చేశారు. గోడకు బంతి కొడితే ఎంత వేగంగా తిరిగి వస్తుందో ప్రజలు అదే చూపించారు. ఓ ఓ పెద్ద మనిషి అంటున్నాడు కన్నీరు కార్చి ప్రజలను సభకు వచ్చెలా చేశారు అని. కాంగ్రెస్ లో స్వాతంత్య్రం ఎక్కువ కాంగ్రెస్ లో ప్రేమ ఎక్కువ. అది కావాలని ప్రజలు అనుకుంటున్నారు. హిట్లర్ ప్రభుత్వాన్ని కాదు నాయనా ప్రజలు కోరుకునేది. నిన్న వచ్చిన నేషనల్ విూడియా స్టేట్ విూడియాలో ఏ ఛానెల్ చూపించని న్యూస్ కేవలం విూ ఛానెల్ విూ కరపత్ర పేపర్ మాత్రమే చూపించాయి. నిన్న విూరు ఎంత కట్టడి చేసిన ప్రజలను సభకు రాకుండా ఆపలేక పోయారు. కొద్ది రోజుల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇదే తీర్పు రాబోతుంది. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల దేవెనతో 10 కి 10 సీట్లు ఒడిస్తామని అన్నారు. కానీ నేను అంతటితో ఆగడం లేదు. ఎవరెన్ని కుయుక్తులు వాడిన ఎంత అధికార దుర్వినియోగం చేసిన రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవబోతున్నాం. ఈ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. ప్రజలకు మంచి ప్రభుత్వం అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు.