బడా బాబుల చేతుల్లోకి అసైన్డ్‌ భూములు అట్లూరు తహసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా

బద్వేలు ఆగష్టు 22 (ఇయ్యాల తెలంగాణ ): వైయస్సార్‌ కడపజిల్లా అట్లూరు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట జాతీయ బి.సి.సంక్షేమ సంఘం,భారత కమ్యూనిస్టు పార్టీ ( సి.పి.ఐ ) మరియు ప్రజా సంఘాలు,టీడీపీ,వైసీపీ ల ఆధ్వర్యంలో ధర్నా  నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసైన్మెంట్‌ కమిటీలో అర్హులైన పేదలకు భూములు దక్కకుండా భూములు ఉన్న బడా భూస్వాములకు మాత్రమే భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అట్లూరు మండలం నల్లాయపల్లె గ్రామపోలంలోఅట్లూరు మండలం నల్లాయపల్లె రెవెన్యూ పొలం 89,90,92,93,95,97,98,99,1 00,103,113,114, 115,116,117,118 మరికొన్ని సర్వే నెంబర్లలో వందల ఎకరాలలో తహాశిల్దార్‌ కు తెలిసే వందల ఎకరాలు భూములు కబ్జా చేస్తున్న తహసిల్దార్‌ ఏమి చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. అలాగే స్థానిక తహశీల్దార్‌,సచివాలయం సవిూపంలోని 404,405 సర్వే నెంబర్‌ లో ఒక్కొక్కరికి 5, 10,సెంట్లలో ఇంటి స్థలాల ఆక్రమణలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కుతోనే జరుగుతున్నాయని వాటిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.ఇసుక,మట్టి పరిమిషన్లపై ఒక్కక్క ట్రాక్టర్‌ ట్రిప్పర్‌  ట్రిప్పుకు 250 నుంచి 350 వసూలు చేసి ప్రభుత్వానికి అందజేయకుండా నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్‌ మోసాలపై ఉన్నతాధికారులు వెలికితీయాలని  ప్రజలు,ప్రజాసంఘాలు స్థానిక తహశీల్దార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బి.సి సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి రాజగోపాలయ్య ,వైసీపీ నేత బీ.సీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రమణయ్య,టీడీపీ ఎస్సి సెల్‌ నియోజకవర్గ నాయకులు రుషి కేశవ్‌,జాతీయ బి.సి సంఘం జిల్లా కార్యదర్శి రాం నరసింహులు,బీసీ నాయకులు ఈటె.మస్తానయ్య, వైసిపి నేత మట్లి ఈశ్వర రెడ్డి,భారత కమ్యూనిస్టు పార్టీ ( సి.పి.ఐ ) జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్‌,బద్వేలు పట్టణ అధ్యక్షులు బాలు,ఏ ఐ టి యు సి కన్వీనర్‌ రాజు, అట్లూరు మండల కన్వీనర్‌ నిత్యపూజయ్య తదితరులు  పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....