బండి అడ్డుకుంటే పగులుతాయి: రాజాసింగ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  బండికి అడ్డువస్తే పగిలిపోతుందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరించారు. బండి సంజయ్‌ పాదయాత్ర 100 కిలో విూటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యం లో ఆయన విూడియాతో మాట్లాడారు. సంజయ్‌ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని,ప్రజలు ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతున్నారని వివరించారు. బండి సంజయ్‌ పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందొ స్పష్టం అవుతోందని. ఈ యాత్ర సక్సెస్‌ అయితే కేసీఆర్‌ ప్రభుత్వం పడిపోతుందన్నారు. పేద ప్రజల బీజేపీ సర్కార్‌ వస్తుందని తెలిపారు. తప్పుడు నివేదికలతో హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఆపారని.. కానీ.. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీనేనని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసు విచారణలో రాజకీయ నాయకులు కూడా బయటకు వస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....