ఫలక్ నుమా ప్రాంతాల్లో ఎం ఐ ఎం ఫ్లోర్ లీడర్ అక్బర్ పర్యటన

నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ పై సమీక్ష


పేద ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం

హైదరాబాద్ మే 20 (ఇయ్యాల తెలంగాణ )
ఆల్ ఇండియా మజ్లీస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏ ఐ ఎం ఐ ఎం ) పార్టీ ఫ్లోర్ లీడర్ జనాబ్ అక్బరుద్దీన్ ఒవైసి ఈ రోజు ఫలక్ నుమా ప్రాంతం లోని పలు ప్రాంతాలను సందర్శించారు.నిత్యావసర కిట్లను పేద ప్రజలకు పంపిణీ చేయవలసినదిగా ఇటీవలే స్థానిక ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం నాడు పలు ప్రాంతాలను సందర్శించి  లాక్ డౌన్ మూలంగా  పేద ప్రజలు ఎలా ఉంటున్నారు. వారు ఏమి తింటున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. ఇప్పటికే అనేక పేద కుటుంబాల కొరకు పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర కిట్ల పంపిణీ కొరకు  చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.

ఈ మేరకు అక్బరుద్దీన్ ఒవైసి ఫలక్ నుమా లోని ఫాతిమా నగర్ గఫారియా మస్జీద్, మన్ను మోడల్ స్కూల్ ఫాతిమా నగర్,గుంటల్ షా బాబా దర్గా,మదీనా కాలనీ ప్రాంతాలలో అయన సందర్శించారు. సుమారు 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందేలా చూశారు. అదేవిధంగా ఫలక్ నుమా డివిజన్ లోని సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ దగ్గర  ఏర్పాటు చేసిన 2000 నిత్యావసర కిట్లను పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో బహదుర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మోజం ఖాన్ కార్పొరేటర్లు  దూద్ బౌలి – మహమ్మద్ గఫ్ఫార్ ,రామ్నాస్ పుర – మహమ్మద్ ముబీన్, ఫలక్ నుమా – తారా బాయి మోతీ లాల్ నాయక్,జహ్నుమ హుస్సేనీ పాషా,కిషన్ బాగ్ – మహమ్మద్ సలీం ,నవాబ్ సాబ్ కుంట –  మహమ్మద్ హన్నన్ తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....