ప్రైవేట్‌ రంగంలోనూ కరోనా టెస్టులు –

ప్రైవేట్‌ రంగంలోనూ కరోనా టెస్టులు

హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌,మే20(ఇయ్యాల తెలంగాణ ): కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రులు,ల్యాబ్ ల‌లో కూడా టెస్టులకు అనుమతి ఇవ్వాలని సూచించింది. దీనిపై ఆంక్షలు  విధించడం సరికాదని పేర్కొంది. గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు  చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు  చేయించుకోవచ్చని తెలిపింది.

 ప్రైవేటు ఆస్పత్రులు , ల్యాబ్ ల‌పై నమ్మకం లేకపోతే… ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రుల , ల్యాబ్‌లు … ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆస్పత్రులు , ల్యాబ్ ల‌లో వైద్య సిబ్బంది, సదుపాయాలను… ఐసీఎంఆర్‌ పరిశీలించి నోటిఫై చేయాలని తెలిపింది. ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే… కరోనా చికిత్సకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు కేవలం  ప్రభుత్వ ఆధీనంలోనే టెస్టులు  జరుగుతున్నాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌ సందర్భంగా ఈ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....