ప్రైవేటు బస్సు బోల్తా..ప్రయాణికులకు స్వల్ప గాయాలు

ఆత్మకూరు నవంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం  బూధవాడ సవిూపంలో కడప`విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి వినుకొండ కు వెళుతున్న కావేరి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు గేదెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న  33 మంది ప్రయాణికులలో పలువురికి స్వల్ప గాయాలు కాగా  వారిని 108 సహాయంతో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉదయగిరి నుండి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. బస్సు ఢీకొని రెండు గేదెలు మృతి చెందాయి 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....