ప్రేక్షకుల ముందుకు ‘‘ఫ్యామిలీ స్టార్‌’’ Movie

సెన్సార్‌ నుంచి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందిన విజయ్‌ దేవరకొండ ‘‘ఫ్యామిలీ స్టార్‌’’, 2 గంటల 30 నిమిషాల నిడివితో అలరించనున్న హోల్‌ సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌

స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘‘ఫ్యామిలీ స్టార్‌’’ సినిమా మరికొద్ది గంటల్లో వరల్డ్‌ వైడ్‌ గా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్‌ నుంచి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ దక్కింది. 2 గంటల 30 నిమిషాల నిడివితో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఫ్యామిలీ స్టార్‌ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే పాజిటివ్‌ వైబ్స్‌ అంతటా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్‌ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

’’ఫ్యామిలీ స్టార్‌’’ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ లో స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. హోల్‌ సమ్‌ ఎంటర్‌ టైనర్‌ గా సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ పెట్ల రూపొందించారు. విజయ్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌ గా నటించింది. ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్‌ సినిమా రేపు ఘనంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....