హైదరాబాద్, జూలై 23 (ఇయ్యాల తెలంగాణ) ప్రముఖ సంఘ సేవకులు, సీనియర్ MBT పార్టీ నాయకులు వగ్గు బాల్ రాజ్ స్వర్గస్తులైనారు. అర్ధరాత్రి 12 గం! 30 ని ప్రాంతంలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వగ్గు బాలరాజ్ అనేక సేవ కార్యకమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పాతనగరంలో గతంలో చాంద్రాయణ గుట్ట నియోజక వర్గం నుంచి MLA గా ఉన్న అమానుల్లా ఖాన్ తో ఎన్నో ఏళ్ళు పని చేశారు. అంతే కాకుండా రాష్ట్ర SC / ST ఐక్య వేదిక కార్యదర్శిగా ఉన్నారు. మాదిగ సేవ సంఘం , దేవాలయ కమిటీల్లో కూడా బాలరాజ్ విశిష్ట సేవలు అందించారు. గత కొంత కాలంగా ఆయన ఉదర సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కందికల్ గేట్ లో గల హిందూ స్మశాన వాటికలో మధ్యాహ్నం 1 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
- Homepage
- Charminar Zone
- ప్రముఖ సంఘ సేవకులు వగ్గు Bal Raj ఇకలేరు !
ప్రముఖ సంఘ సేవకులు వగ్గు Bal Raj ఇకలేరు !
Leave a Comment
Related Post