ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలకు చేరువవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలకు చేరువవుతున్న  కరోనా పాజిటివ్‌ కేసులు

రోజురోజుకు పెరుగుతున్న కేసుల  సంఖ్య


ఆగని కరోనా కల్లోలం 

వైరస్ వల్ల  మరణాల  రేటు 6.9 శాతం


న్యూ ఢిల్లీ, మే 11(ఇయ్యాల తెలంగాణ):  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. కొన్ని దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల  సంఖ్య తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 41,80,303కు చేరింది. ఇందులో 2,83,860 మంది బాధితులు  మరణించారు. ప్రాణాంతక వైరస్‌ బారినుంచి 14,90,776 కోుకుని డిశ్చార్చికాగా, మరో 24,05,667 మంది బాధితులు  చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వల్ల  మరణాల  రేటు 6.9 శాతం ఉన్నది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 13,67,638 కరోనా కేసులు  నమోదయ్యాయి. దేశంలో ఈ వైరస్‌ వల్ల  80787 మంది మరణించారు.

 గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో 776 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 10,30,515 కరోనా పాజిటివ్‌ కేసులు  యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసుల  విషయంలో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 2,64,663 మంది ఈ వైరస్‌ బారిన పడగా, ఇప్పటివరకు 26,621 మంది మరణించారు. మరో 61,603 కేసులు  యాక్టివ్‌గా ఉండగా, 1,76,439 మంది బాధితులు  కోలు కున్నారు. బ్రిటన్‌లో 2,19,183 పాజిటివ్‌ కేసులు  నమోదవగా, ఈ వైరస్‌ వ్ల 31,855 మంది బాధితులు  మృతిచెందారు. ఇటలీలో ఇప్పటివరకు 2,19,070 కరోనా కేసులు  నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన 30,560 మంది మరణించారు. ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో కేసు నమోదవుతున్న రష్యాలో 2,09,688 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దేశంలో ఇప్పటివరకు 1915 మరణించారు. 1,73,467 కేసు యాక్టివ్‌గా ఉండగా, 34,306 మంది బాధితులు  కోలుకున్నారు. బ్రెజిల్‌లో 1,62,699 కరోనా పాజిటివ్‌ కేసులు  నమోదవగా, ఇప్పటివరకు 11,123 మంది మరణించారు. దేశంలో 86,679 యాక్టివ్‌ కేసులు  ఉన్నాయి.

కరోనా వైరస్‌ వల్ల  అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 80 వేలు  దాటింది.  గత 24 గంటల్లో వైరస్‌ వల్ల 876 మంది ప్రాణాలు  కోల్పోయారు.  గత కొన్ని రోజుల  నుంచి ప్రతి రోజూ అమెరికాలో వెయ్యి మంది మరణిస్తున్న విషయం తెలిసిందే.  అమెరికాలో అత్యధిక స్థాయిలో వైరస్‌ పాజిటివ్‌ కేసులు  నమోదు అయ్యాయి. 13,66,962 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. అమెరికాలో రికవర్‌ అయిన కేసుల  సంఖ్య 210684గా ఉన్నది. తాజా మరణాల  సంఖ్యతో అమెరికాలో మరణాల  రేటు 5.9 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. . ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సంక్రమించిన వారి సంఖ్య 4024009గా ఉన్నది. దీంట్లో 279311 మంది మరణించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....