ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలకు చేరువవుతున్న కరోనా పాజిటివ్ కేసులు
రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య
ఆగని కరోనా కల్లోలం
వైరస్ వల్ల మరణాల రేటు 6.9 శాతం
న్యూ ఢిల్లీ, మే 11(ఇయ్యాల తెలంగాణ): ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. కొన్ని దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్ వంటి దేశాల్లో వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 41,80,303కు చేరింది. ఇందులో 2,83,860 మంది బాధితులు మరణించారు. ప్రాణాంతక వైరస్ బారినుంచి 14,90,776 కోుకుని డిశ్చార్చికాగా, మరో 24,05,667 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వల్ల మరణాల రేటు 6.9 శాతం ఉన్నది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 13,67,638 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ వైరస్ వల్ల 80787 మంది మరణించారు.
గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో 776 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 10,30,515 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసుల విషయంలో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 2,64,663 మంది ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు 26,621 మంది మరణించారు. మరో 61,603 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,76,439 మంది బాధితులు కోలు కున్నారు. బ్రిటన్‌లో 2,19,183 పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వ్ల 31,855 మంది బాధితులు మృతిచెందారు. ఇటలీలో ఇప్పటివరకు 2,19,070 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన 30,560 మంది మరణించారు. ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో కేసు నమోదవుతున్న రష్యాలో 2,09,688 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశంలో ఇప్పటివరకు 1915 మరణించారు. 1,73,467 కేసు యాక్టివ్‌గా ఉండగా, 34,306 మంది బాధితులు కోలుకున్నారు. బ్రెజిల్లో 1,62,699 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇప్పటివరకు 11,123 మంది మరణించారు. దేశంలో 86,679 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా వైరస్ వల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 80 వేలు దాటింది. గత 24 గంటల్లో వైరస్ వల్ల 876 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ అమెరికాలో వెయ్యి మంది మరణిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో అత్యధిక స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13,66,962 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అమెరికాలో రికవర్ అయిన కేసుల సంఖ్య 210684గా ఉన్నది. తాజా మరణాల సంఖ్యతో అమెరికాలో మరణాల రేటు 5.9 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. . ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 4024009గా ఉన్నది. దీంట్లో 279311 మంది మరణించారు.