ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా YOGA DAY

మానవాళికి  YOGA  గొప్పవరం : రాష్ట్రపతి కోవింద్‌

యోగసనాలు వేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని 

న్యూఢిల్లీ, జూన్‌ 21, (ఇయ్యాల తెలంగాణ)

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్‌ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పాల్గొని, యోగా ఆసనాలు వేశారు. దేశ రాజధాని దిల్లీ త్యాగరాజ స్టేడియంలో దిల్లీ సీఎం అరవింద్‌? కేజ్రీవాల్‌?, ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌? సీఎం పుష్కర్‌ సింగ్‌? ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.మైసూర్‌లో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. అందరిదన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. భారత ప్రత్యేకత, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింభిస్తుందని, కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్నారు. యోగా దినోత్సవం అనేది ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అన్నారు. కొన్నేళ్ల క్రితం ఇండ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించిందన్నారు.

యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని, యోగా జీవన విశ్వాసం ఇస్తుందని చెప్పారు. కరోనా విపత్తు సమయంలోనూ యోగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. సమాజంలో శాంతిని యోగా నెలకొల్పుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుందని, యోగా వ్యక్తికే పరిమితం కాదని.. సకల మానవాళికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని, ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు యోగా సందేశం చేరవేస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు యోగా దోహదం చేస్తుందన్నారు.

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమలు జరుగుతున్నాయి. ఢల్లీి నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. యోగాసనాలు వేసిన తర్వాత యోగా ప్రాముఖ్యతను వివరించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా రామ్‌ నాథ్‌ మాట్లాడుతూ.. ‘మన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా ఒక భాగం. మానవాళికి భారత్‌ ఇచ్చిన గొప్ప వరం యోగా. శరీరం, ఆత్మలను పరిపూర్ణం చేసే అద్భుత సాధనం యోగా’ అంటూ రాష్ట్రపతి చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో భాగంగా రామ్‌ నాథ్‌ పలువురితో కలిసి యోగాసనాలు వేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....