ప్రపంచవ్యాప్తంగా COVID కొత్త VARIANT తో ముంచుకొస్తున్న ప్రమాదం

న్యూ డిల్లీ ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్లతో ప్రమాదం ముంచుకొస్తున్నది. 55పైగా దేశాల్లో ఎరిస్‌ కొవిడ్‌ కేసులు నమోదైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) ఈ వైరస్‌ను ‘వేరియంట్‌ అండర్‌ మానిటరింగ్‌’గా వర్గీకరించింది. కొత్త రూపాంతరాల్లో అదనపు ఉత్పరివర్తనాలు కనిపిస్తున్నాయని, అవి ఇన్ఫెక్షన్‌ను పెంచుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. టీకా తీసుకొని, గతంలో కొవిడ్‌ బారినపడి కోలుకున్న వారికి సైతం ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేగంగా ఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ప్రభావం ఎంత మేరకు ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. కొత్త వేరియంట్లు బీఏ.2.86, ఈజీ.5.1 వేరియంట్లతో భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏరిస్‌ వేరియంట్‌ గతంలోనూ భారత్‌లో కనిపించింది. అయితే, దీంతో కేసుల పెరుగుదల, తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

రెండు కొత్త వేరియంట్‌ కేసుల పెరుగుదల;కరోనా కొత్త వేరియంట్‌ బీఏ.2.86 ఒమిక్రాన్‌0ళి వేరియంట్‌ నుంచి పుట్టుకువచ్చిన రూపాంతరం కావచ్చని పేర్కొంటు. ఇజ్రాయెల్‌, డెన్మార్క్‌, యూకే, యూఎస్‌లలో ఈ వేరియంట్‌ కారణంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఈజీ.5.1 ఏరిస్‌ వేరియంట్‌ కేసులు ఇప్పటి వరకు 55 కంటే ఎక్కువ దేశాల్లో రికార్డయ్యాయి. ఈ వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏరిస్‌ వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ పరంగా మరింత తీవ్రంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ దీని కారణంగా వ్యాధితీవ్రతలో గణనీయమైన తేడా కనిపించలేదని.. ఈ రెండు వేరియంట్లతో ఆందోళనపడాల్సిన పని లేదని చెబుతున్నారు.

భారత్‌కు ప్రమాదం ఎంత?

భారత్‌లో కరోనా పూర్తిగా ప్రస్తుతం చాలా నియంత్రణలో ఉన్నది. గత 24 గంటల్లో దాదాపు 60 మందికి వైరస్‌ సోకింది. భారతదేశంలో 2.86 వేరియంట్‌ ప్రమాదం ఎక్కువగా లేదు. ఒమిక్రాన్‌ సుమారు 20నెలలుగా ఉండగా.. ఇన్ఫెక్షన్‌ విషయంలో గణనీయంగా మార్పులేదు. ఈ పరిస్థితుల్లో కొత్త వేరియంట్లు ఏదైనా తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో పెద్ద సంఖ్యలో జనం ఒమిక్రాన్‌ బారినపడ్డారు. కాబట్టి కొత్త వేరియంట్ల నుంచి వ్యాధి తీవ్రత ప్రమాదం పెంచే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు.

కొత్త వేరియంట్లే లక్ష్యంగా వ్యాక్సిన్ల తయారీ;ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త వేరియంట్‌ల బెదిరింపుల దృష్ట్యా, దాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యాక్సిన్‌లను తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (అఆఅ) నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెప్టెంబర్‌ చివరి నాటికి కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇంకా ఎఫ్‌డీఏ వాటిని ధ్రువీకరించలేదు. చాలా మందికి చివరి కొవిడ్‌ డోసు వేసి ఆరు నుంచి 8 నెలలు కావొస్తుండగా.. దాంతో రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు;ఆగస్టు నుంచి కొవిడ్‌ మళ్లీ ఆందోళన కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కేసుల పెరుగుల చాలా తక్కువ (10శాతం) మాత్రమే ఉందని, ఈ క్రమంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. కొవిడ్‌ బాధితులు చాలా మంది సులభంగా కోలుకుంటున్నారని, ఎవరికీ ఆక్సిజన్‌, వెంటిలెటర్‌ అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా కొవిడ్‌కు వ్యతిరేకంగా నివారణ చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటున్నారు. అయితే, పెరుగుతున్న ఇన్ఫెక్షన్‌ కొత్త వేరియంట్లు తయారయ్యేందుకు దారితీయవచ్చని పేర్కొంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....