ప్రపంచంలోనే అత్యంత కలుషిత Metro Polytan ప్రాంతంగా బీహార్‌లోని బెగుసరాయి

👉 అత్యల్ప వాయు నాణ్యత కలిగిన దేశాల్లో భారత్‌ మూడవ స్థానం

👉 అత్యంత కలుషిత మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా బీహార్‌లోని బెగుసరాయి

👉 అత్యల్ప స్థాయిలో వాయు నాణ్యత ఉన్న నగరంగా రికార్డుకెక్కిన ఢిల్లీ 

న్యూఢిల్లీ, మార్చ్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) :  ప్రపంచంలోనే అత్యంత కలుషిత మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా బీహార్‌లోని బెగుసరాయి నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ  మాత్రం అత్యల్ప స్థాయిలో వాయు నాణ్యత ఉన్న నగరంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప వాయు నాణ్యత కలిగిన దేశాల్లో భారత్‌ మూడవ స్థానంలో ఉన్నది. ఆ జాబితాలో 134 దేశాల నివేదికను వెల్లడిరచారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ తర్వాత ఇండియా ఉన్నట్లు వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ పేర్కొన్నది. 2022లో పీఎం 2.5 కాన్‌సెంట్రేషన్‌ ఉన్న దేశాల్లో ఇండియా 8వ స్థానంలో ఉండేది.అతి కలుషిత మెట్రోపాలిటన్‌గా బెగుసరాయి తొలి స్థానంలో ఉన్నది. అక్కడ పీఎం 2.5 స్థాయి 118.9 మైక్రోగ్రామ్స్‌గా ఉన్నది. 2022 ర్యాంకింగ్స్‌లో అసలు ఈ సిటీకీ ఎక్కడ చోట లేకుండే. ఢల్లీిలో పీఎం 2.5 స్థానం రెండేళ్ల క్రితం 89.1 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ విూటర్‌గా ఉన్నది. ఇక 2023లో ఆ రేంజ్‌ 92.7 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ విూటర్‌గా మారింది.మోస్ట్‌ పొల్యూటెడ్‌ క్యాపిటల్‌ సిటీగా ఢల్లీి నిలవడం ఇది వరుసగా నాలుగవ సారి. 2018 నుంచి ఇండియా కలుషిత ర్యాంకుల్లో టాప్‌లో ఉంటోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....