వరంగల్ జులై 4, (ఇయ్యాల తెలంగాణ ):ప్రధాని మోదీ నరేంద్రల మోడీ వరంగల్ పర్యటన ఖరారయింది. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసిరు. మోదీ 8న ఉదయం దేశ రాజధాని ఢల్లీి లో బయలుదేరి ఉదయం 9.45 గంటలకి హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో వరంగల్కు బయల్దేరి 10.35కి వరంగల్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్లో పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు బహిరంగసభలో మెదీ ప్రసంగిస్తారు. అనంతరం 12.15కి వరంగల్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 1.10 గంటలకు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ పర్యటనకు ప్రధాని వెళతారు.
- Homepage
- National News
- ప్రధాని మోడీ వరంగల్ పర్యటన ఖరారు
ప్రధాని మోడీ వరంగల్ పర్యటన ఖరారు
Leave a Comment