ప్రజా ప్రస్థానం యాత్ర 400 KM – కొనసాగుతున్న షర్మిలక్క ప్రభంజనం

నల్లగొండ, మార్చి 23 (ఇయ్యాల తెలంగాణ) :  400 వందల కిలోమీటర్ల  పాదయాత్ర పూర్తి చేసిన వైఎస్ షర్మిల. ప్రజా ప్రస్థానం యాత్ర లో భాగంగా వైఎస్సార్ టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నేటికి నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. నేటి 34రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేర్ నియోజకవర్గం మోటకొండురు మండలం వరటురు గ్రామం నుండి షర్మిల పాదయాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు పార్టీలో చేరగా వారకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు తర్వాత ఓరుటురు గ్రామం నుండి దుర్గసానిపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగింది అక్కడ ప్రజలతోటి ముచ్చటిస్తుండగా వైఎస్ షర్మిలతో పాటు కార్యకర్తల పై తేనే టిగలు దాడి చేశాయి. తేనేటిగలు దాడి చేసిన వెనక్కీ తిరగకుండా పాదయాత్ర కొనసాగించారు షర్మిల. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజా సమస్యలు గాలికి వదిలేసినాడని అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకాల వెనుక మోసమే ఉందన్నారు. రైతు బంధు పేరుతో ఎకరాకు 5వేలుఇచ్చి, రైతులకు సంబందించిన అనేక పధకాలను కేసీఆర్ బంద్ పెట్టిండని అన్నారు.

 ఇలా దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్, మహిళా సాధికారత పేర ఋణాలని, పెన్షన్లని ప్రతి దాంట్లో కేసీఆర్ కీ మోసపూరితమైన ఆలోచనలే ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీకి ఓట్లు కావల్సి వచ్చినపుడే అది మాఫి అని, ఇది మాఫి అని ప్రజలకు మాయల పరిపాలనే కేసీఆర్ కొనసాగిస్తున్నారని అన్నారు.బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణగా, ఆత్మ హత్యల తెలంగాణ గా రాష్టాన్ని తయారు చేశారన్నారు. కార్యక్రమం లో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, వాడుక రాజగోపాల్, నీలం రమేష్, చైతన్య రెడ్డి, బి సత్యవతి, వడ్లోజు, వేంకటేశ్, బోర్గి సంజీవా, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....