ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు నడుచుకోవాలి

సత్ఫలితాలు  ఇస్తున్న కరోనా నివారణ చర్యలు



మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి

బస్సులో ప్రయాణించి పరిస్థితిని పరిశీలించిన మంత్రి అల్లోల్ల

నిర్మల్‌,మే20(ఇయ్యాల తెలంగాణ):  కరోనా మహమ్మారి నియంత్రణకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలు  సత్ఫలితాలు  ఇస్తున్నాయని, అదేవిధంగా ప్రజందరూ భౌతిక దూరం..పరిశుభ్రత పాటించాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల్ల  ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ బస్టాండ్‌ నుంచి మంచిర్యాల  చౌరస్తా వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి అల్లోల్ల , ఎమ్మెల్యే రేఖా నాయక్‌ ప్రయాణించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మే 31వ తేదీ వరకు వ్యాపారులు , ప్రజలు  స్వచ్ఛందంగా నిబంధనలను పాటించి కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు దోహదపడాలని కోరారు. నిర్మల్‌ పట్టణంలోని పలు  ప్రాంతాల్లో మంత్రి ఆకస్మికంగా పర్యటించి దుకాణాలు , చికెన్‌ షాపులను పరిశీలించారు. నిర్మల్‌ టీ సెంటర్‌ నుండి నారాయణ రెడ్డి మార్కెట్‌, గంగా కాంప్లెక్స్‌, బస్టాండ్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. వ్యాపారులు , ప్రజలు  ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను పాటిస్తున్నారా ? లేదా అని పరిశీలించారు. దుకాణాల  వద్ద ప్రజలు  భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని, మాస్కులు  ఉన్నవారినే షాపుల్లోకి అనుమతించాలని వ్యాపారులకు సూచించారు. ప్రజలంతా మాస్కులు  ధరించాలని, నిబంధనలు  పాటించని వారిపై చట్టం ప్రకారం చర్యలు  తీసుకుంటామన్నారు. దూరప్రాంతాల  నుంచి వచ్చే ప్రయాణికులకు టిఫిన్‌, భోజన సదుపాయం కల్పించేలా బస్టాండ్‌లోని క్యాంటీన్లను, బేకరీలను తెరిచే విధంగా చూడాలని డీయంను మంత్రి ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం లాక్‌ డౌన్‌ సడలించిన నేపథ్యంలో పట్టణంలోని దుకాణాలను తెరిచారని, ఆర్టీసీ బస్సులను కూడా నడిపిస్తున్నామన్నారు. బస్టాండ్ ల‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రయాణికులకు  శానిటైజర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. వ్యాపారులు , ప్రజలంతా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ణప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్‌తో కలిసి  ఖానాపూర్‌కు వెళ్ళే బస్సులో బస్టాండ్‌ నుంచి మంచిర్యాల  చౌరస్తా వరకు ప్రయాణించి, కాసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. కొందరు ప్రయాణికులకు మంత్రి స్వయంగా టిక్కెట్లను అందజేశారు. కరోనా మహమ్మారి నిర్మూలనకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీసుకుంటున్న చర్యలు  సత్ఫలితాలు  ఇస్తునన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌,  జిల్లా గ్రంథాయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఎఫ్‌ఎస్సీయస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ నాయకు మారుగొండ రాము, కౌన్సిర్లు, ఇతర ప్రజాప్రతినిదులు , అధికారులు  పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....