సూర్యాపేట: ( ఇయ్యాల తెలంగాణ) ప్రకృతి మెచ్చే రంగులతో హోళీ వేడుకలు జరుపుకోవాలని సూర్యాపేట జీల్లా తెలంగాణ జన సమితి పార్టీ జీల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ బచ్చలకూరి గోపి అన్నారు. హోలీ పండగ సందర్బంగా గాజువాక మల్కాపురం లో ఆనందోత్సవాలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ కన్వీనర్ మాట్టాడుతూ హోళీ ఆడిన తరువాత చెరువులు, కుంటలు, వాసుల వద్దకు స్నానాలకు వేల్లీ నీటిని కలుషితం చేయకూడదని సూచించారు. ఇదే సందర్బంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకన్న గౌడ్ బృందం, తెలంగాణ జన సమితి పార్టీ బృందం ఈ సారి కలసి హోళీ వేడుకలను జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బచ్చలకూరి సైదులు, సైదులు, గుండు అంజయ్య, సోంటీ అంజీ, సైదులు, జానకి రాములు, వీరస్వామి, ధనమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి మెచ్చే రంగులతోనే Holi వేడుకలు జరుపుకోవాలి : సైదులు.
Leave a Comment