పోలీసు అమరవీరుల స్మృతి దినత్సవం

ఏలూరు అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ):ఏలూరు పోలీసు ప్రధాన కార్యలయం వద్ద గల పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ లో  పోలీసు అమరవీరుల స్మృతి దినం` 2023 కార్యక్రమానికి   అతిధులుగా  ఏలూరు రేంజ్‌ ఏలూరు డిఐజి జి.వి.జి. అశోక్‌ కుమార్‌,  జిల్లా కలక్టరు  వే.ప్రసన్న వెంకటేష్‌,  జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గంట పద్మశ్రీ ప్రసాద్‌,  అసిస్టెంట్‌ కలెక్టర్‌  పూజ,  వైల్డ్‌ లైఫ్‌ మేనేజ్మెంట్‌ డివిజన్‌ డిఎఫ్‌ఓ  శివశంకర్‌, తదితరులు హజరయ్యారు. పోలీసు సిబ్బంది  గౌరవ వందనం సమర్పించారు. పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించి అమర వీరులు కు స్మృతి పేరేడు ను నిర్వహించారు. నిస్వార్థమైన, అంకితభావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరికీ నివాళులర్పించారు.

ఈ సంవత్సరం దేశం మొత్తమువిూద 188 మంది, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో `01, ప్రాణాలు కోలుపోయిన  అమర వీరులులకు శ్రద్దాంజలి ఘటించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....