పేలిన పెట్రోల్‌ బంక్‌.. ఎగసిపడిన మంటలు

రాజమండ్రి ఆగష్టు 8, (ఇయ్యాల తెలంగాణ ):తూర్పుగోదావరి జిల్లా  బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు..వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్‌ బంక్‌ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు. అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌ కూడా బ్లాస్టయింది. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో బంక్‌ ప్రక్కన వున్న గాయత్రి రైస్‌ మిల్‌ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్‌ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....