పేద ప్రజల ఆకలి తీర్చాడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి.. AIMIM

పేద ప్రజల ఆకలి తీర్చాడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి.. AIMIM

హైదరాబాద్, మే 22 (ఇయ్యాల తెలంగాణ )

హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశాల మేరకు ఈ రోజు  దూద్ బౌలి డివిజన్ లోని పలు ప్రాంతాల పేద ప్రజలకు  నిత్యావసర సరుకుల రేషన్  కిట్లను పంపిణీ చేయడం జరిగింది. దూద్ బౌలి డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ గఫ్ఫార్ ఆధ్వర్యంలో సాలార్ ఏ మిల్లత్ కమ్మూనిటీ హాల్ లో సుమారు 200 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంలో కార్పొరేటర్ మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడానికి తమ స్వంత డబ్బులతో ప్రజలందరికి నిత్యావసర సరుకుల కిట్లను అందజేస్తున్న అసదుద్దీన్ కుటుంబానికి, అక్బరుద్దీన్ కు నూరుద్దీన్ కు మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు మనందరి తరపున ప్రసాదించాలని కోరుకుందామని తెలిపారు. ఈ కార్యక్రంమలో ఎం ఐ ఎం పార్టీ నాయకులు పాల్గొని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకుల కిట్లు అందేలా కృషి చేశారు.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....