పేద కుటుంబాలకు సరుకులు పంపిణీ
హైదరాబాద్, మే 15 : ఇయ్యాల తెలంగాణ
పాతనగరంలోని బహదూర్ పుర నియోజక వర్గం పరిధిలోని 150 పేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎం ఐ ఎం పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి పిలుపు మేరకు పలు పేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. బహదూర్ పుర శాసన సభ్యులు మోజం ఖాన్ ఆదేశాను సారం ఫలక్ నుమా డివిజన్ కార్పొరేటర్ తార బాయి మోతిలాల్ నాయక్ ఫాతిమా నగర్ వట్ట పల్లి పర్దా ఘాట్ ప్రాంతాల్లో సరుకులు పంపిణీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎం ఐ ఎం నాయకులు పాల్గొని నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ అయ్యేలా చూసారు.