‘పెళ్లి కాని ప్రసా’ద్‌ First Look రిలీజ్‌,

సప్తగిరి, అభిలాష్‌ రెడ్డి గోపిడి, థామ విూడియా ఎంటర్టైన్మెంట్స్‌, చాగంటి సినిమాటిక్‌ వరల్డ్‌ సమర్పణలో ‘పెళ్లి కాని ప్రసా’ద్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌, మార్చి 21న ూపఅ ద్వారా సినిమా రిలీజ్‌  

సప్తగిరి హీరోగా అభిలాష్‌ రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఓ అవుట్‌`అండ్‌`అవుట్‌ ఎంటర్టైనర్‌ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని విజన్‌ గ్రూప్‌ కు చెందిన కె.వై. బాబు, థామ విూడియా ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై భాను ప్రకాష్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్‌, వైభవ్‌ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్నారు. చాగంటి సినిమాటిక్‌ వరల్డ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ (ూపఅ) విడుదల చేస్తుంది.

టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ తో సహా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను మేకర్స్‌ రివిల్‌ చేశారు. ఈ సినిమా పెళ్లి కాని ప్రసాద్‌ అనే టైటిల్‌ పెట్టారు. ఇది ఐకానిక్‌ బ్లాక్‌బస్టర్‌ మల్లీశ్వరిలో విక్టరీ వెంకటేష్‌ క్యారెక్టర్‌ ని గుర్తు చేస్తోంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సప్తగిరి పాత్ర హ్యుమర్‌ నేచర్‌ ని హైలైట్‌ చేస్తూ డిఫరెంట్‌ ఎక్స్‌ ప్రెస్షన్స్‌ ని ప్రెజెంట్‌ చేస్తోంది. ఈ పోస్టర్‌ హిలేరియస్‌ డిజైన్‌ ఈ చిత్రం హై ఎంటర్మైన్మెంట్‌ తో ఉంటుందని సూచిస్తుంది.

ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. మధు ఎడిటర్‌. ప్రియాంక శర్మ కథానాయికగా నటించారు, మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌ , అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మార్చి 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు.

తారాగణం: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్‌, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....