పూరీ జగన్నాధ్‌, ఛార్మి కౌర్‌, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రారంభం

జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ల  క్రేజీ ప్రాజెక్ట్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లో తన పాత్ర కోసం రామ్‌ మేకోవర్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్‌ ఫర్మేషన్‌ చూపించే వీడియోలో సూపర్‌ స్మార్ట్‌ గా కనిపించారు రామ్‌. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌ పై పూరీ జగన్నాధ్‌, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. భారీ సెట్‌ లో రామ్‌, ఫైటర్స్‌పై భారీ సీక్వెన్స్‌ తో టీమ్‌ ప్రొడక్షన్‌ పనులను ప్రారంభించింది. ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం నుంచి పూరీ జగన్నాధ్‌ తో అసోసియేట్‌ అవుతున్న స్టంట్‌ డైరెక్టర్‌ కేచ ఈ సీక్వెన్స్‌ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ హై`వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు.వర్కింగ్‌ స్టిల్‌లో రామ్‌, చేతిలో ఫైర్‌ వర్క్స్‌ పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించారు. పూరి, కేచ, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు.డబుల్‌ ఇస్మార్ట్‌ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో  తెలియజేస్తారు మేకర్స్‌.డబుల్‌ ఇస్మార్ట్‌ పాన్‌ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది. తారాగణం: రామ్‌ పోతినేని

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....