పిల్‌ వేసిన వ్యక్తికి పదివేల జరిమానా – సోషల్‌ డిస్టెన్స్‌ తప్పు కాదు

సోషల్‌ డిస్టెన్స్‌ తప్పు కాదు


పిల్‌ వేసిన వ్యక్తికి పదివేల  జరిమానా


న్యూఢిల్లీ ,మే9(ఇయ్యాల తెలంగాణ ): సోషల్‌ డిస్టెన్సింగ్‌ పదాన్ని వినియోగించ  రాదంటూ దాఖలైన పిల్‌ని కోర్టు కొట్టివేయడమే కాకుండా పిల్‌ దాఖలు  చేసిన వ్యక్తికి 10,000 జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు  జారీచేసింది. సోషల్‌ డిస్టెన్స్‌కి బదులు, ఫిజికల్‌ డిస్టెన్స్‌ అనే పదాన్ని వాడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ బీ.ఆర్‌ గవాయ్‌తోకూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ జరిపి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణార్హం కాదని కోర్టు కొట్టివేసింది. డిస్టెన్సింగ్‌ అనే పదం వివక్షతో కూడుకున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనీ అందుకే ఆ పదం వాడుక మార్చాలనీ షకీల్‌ ఖురేషీ పిల్‌ దాఖలు  చేసిన నేపథ్యంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....