పింగళి వెంకయ్య కు భారతరత్న ఇవ్వాలి

హైదరాబాద్‌ ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ ):పింగళి వెంకయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు జగదాంబ డిమాండ్‌

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలని పింగళి వెంకయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు జగదాంబ డిమాండ్‌ చేశారు. బుదవారం పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మారక సభలో పింగళి వెంకయ్య గారికి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ట్రస్ట్‌ అధ్యక్షురాలు జగదాంబ మాట్లాడుతూ పింగళి వెంకయ్య జయంతిని వంద సంవత్సరాలు పూర్తి చేసిన ఘనత తమ ట్రస్ట్‌ కే చెందుతుందని తెలిపారు జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవం అయిన 1921 సంవత్సరంమార్చ్‌ 31 నుండి ఏప్రిల్‌ రెండు వరకు ప్రభుత్వం  అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని ఆమె కోరారు అంతేకాకుండా దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క ట్రస్టు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు సహాయపడాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర క్యాబినెట్‌ మంత్రి కిషన్‌ రెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ జగదాంబ ని ఫోన్లో పరామర్శించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హావిూ ఇచ్చి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా విూడియా కన్వీనర్‌ ఐజాక్‌ రాజ్‌ మరియు బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ మరియు ట్రస్టు సభ్యులు సీతారత్నం నాదెళ్ల అన్నపూర్ణ శ్యామలరావు  మేఘన శ్రీకాంత్‌ అనుదీప్‌ సాయికిరణ్‌ చంద్రకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....