పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు : తీగుల్ల పద్మారావు

సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్‌ స్పష్టం చేశారు. సితాఫలమండీ డివిజన్‌ కు చెందిన తెరాస పార్టీ కార్యకర్త  సంతోష్‌ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు.  అయన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమాచారం తెలుసుకున్న పద్మారావు గౌడ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి రూ.ఐదు లక్షల మేరకు నిధులను మంజూరు చేయించారు. రూ. అయిదు లక్షల చెక్కును శనివారం షాబాజ్‌ గూడా లోని దివంగత  సంతోష్‌ కుమార్‌ నివాసంలో ఆయన సతీమణి  అనిత కు అందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....