బాపట్ల జులై 8 ( ఇయ్యాల తెలంగాణ );పాత గొడవల నేపథ్యంలో దారికాచి వ్యక్తి పై దాడి చేసిన ఘటన బాపట్ల జిల్లా రేపల్లె మండలంలో జరిగింది. ఊలుపాలెం గ్రామానికి చెందిన ఖైతే పల్లి నాగరాజుకు అదే గ్రామానికి చెందిన మరి కొందరితో పాత గొడవలు ఉన్నాయని సమాచారం .ఈ క్రమంలో ఆటో డ్రైవర్ అయిన నాగరాజు ప్రయాణికులను ఎక్కించుకుని రేపల్లె వెళ్తున్నాడు. అరవపల్లి గ్రామం శివారు లో రాగానే…అప్పటికే అక్కడ దారికాచి ఉన్న కొందరు వ్యక్తులు ఆటోలో నుంచి బయటికి లాగి కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..మెరుగైన చికిత్స కోసం వైద్యులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడి గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
- Homepage
- iyyala telangana
- పాత గొడవల నేపధ్యంలో AUTO DRIVER పై దాడి
పాత గొడవల నేపధ్యంలో AUTO DRIVER పై దాడి
Leave a Comment