పాకిస్తాన్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

ఇస్లామాబాద్‌ మార్చి  4 (ఇయ్యాల తెలంగాణ) :  పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి 30 మంది చనిపోయారు, మరో 56 మంది గాయాలపాలయ్యారు. కిస్సా ఖ్వాని బజార్‌ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారికి పెషావర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెషావర్‌ సిటీ పోలీస్‌ అధికారి ఇజాజ్‌ అషాన్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ఇద్దరు దుండగులు మసీదులోకి చొరబడే ప్రయత్నంలో ముందుగా డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారట. అనంతరం మసీదులో బీభత్సం సృష్టించారని తెలిపారు. శుక్రవారం ప్రార్థన జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని, అయితే ఈ దాడిపై ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదని పెషావర్‌ పోలీసులు పేర్కొన్నారు. దాడిలో చనిపోయిన 30 మంది మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని లేడీ రీడిరగ్‌ విూడియా మేనేజర్‌ ఆసిమ్‌ ఖాన్‌ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....