పవన్‌ అభిమానులకు మరో సర్ప్రైజ్‌

2న బీమ్లా నాయక్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులకు ఒక్కో సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘భీమ్లా నాయక్‌’  చిత్రం ఫస్ట్‌ గింప్స్‌, టీజర్‌తో అలరించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత పక్కా మాస్‌ లుక్‌లో కనిపించిన ఆయన్ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫస్ట్‌ గ్లింప్స్‌కు వచ్చిన స్పందన, అందులో డైలాగ్‌లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి భీమ్లానాయక్‌ బృందం సిద్ధంగా ఉంది. సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.16 నిమిషాలకు చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సాగర్‌ కె చంద్ర ట్విట్టర్‌ వేదికగా వెల్లడిరచారు. మండుతున్న రైఫిల్స్‌ ప్రతిధ్వనించ డానికి సిద్ధమవుతున్నాయి. పవర్‌ అంథమ్‌తో పవర్‌డేను సెలబ్రేట్‌ చేసుకుందాం అని ట్వీట్‌ చేశారు దర్శకుడు. మలయాళ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్‌         కె.చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....