పలు వీధులు శానిటైజ్ తో పరిశుభ్రం – కరొనతో దూరం

పలు వీధులు శానిటైజ్ తో పరిశుభ్రం – కరొనతో దూరం


హైదరాబాద్, మే 15 :  (ఇయ్యాల తెలంగాణ )

పాతనగరంలోని బహదూర్ పుర నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో వీధులన్నీ శానిటైజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, బారిష్టర్ అసదుద్దీన్ ఆదేశానుసారం బహదుర్ పుర శాసన సభ్యులు మహమ్మద్ మోజం ఖాన్ పర్యవేక్షణలో సిబ్బంది పలు వీధులను శానిటైజ్ చేశారు. ఫలక్ నుమా డివిజన్ కార్పొరేటర్ తార బాయి మోతీ లాల్ నాయక్ స్వీయ పర్యవేక్షణలో కింగ్ అవెన్యూ పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేయడం జరిగింది.
కాలనీ ఇంచార్జి అరాఫత్ అలీ తదితరులు దగ్గరుండీ ఈ ప్రాంతాలను సురక్షితంగా ఉండేలా శానిటైజ్ చేయించడం జరిగింది. కరోనా మూలంగా ఎవరూ ఇబ్బందుల పాలు కావద్దని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....