యువతలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందేలా..
ప్రభుత్వ విప్ భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మెన్ మోహిత్‌రెడ్డి కృషి అభినందనీయం
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వెల్లడి
వినాయక విగ్రహాల పంపిణీని ప్రారంభించిన టీటీడీ ఈఓ
భక్తి తత్వంలో చెవిరెడ్డి బాహుబలి
తిరుపతి,సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : చంద్రగిరి నియోజకవర్గంలో వినాయక చవితిని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె పల్లెకు పర్యావరణ హితమైన కాగితంతో తయారైన 1,060 పెద్ద వినాయక విగ్రహాలను శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వినాయక విగ్రహాల తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఈఓ ను తుడా ఛైర్మెన్ మోహిత్ రెడ్డి ఘనంగా స్వాగతించారు. ముందుగా వినాయక ప్రతిమలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుచానూరు మార్కెట్ యార్డ్ వేదికైంది. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పంచాయితీలోని వీధి వీధికి పెద్ద విగ్రహాలు పంపిణీ.. 34 ప్రాంతాల నుంచి 108 గ్రామాలకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది నుంచి ఈ విగ్రహాల తయారీ ప్రారంభించినట్లు వెల్లడిరచారు.
అందరూ సాంప్రదాయ బద్దంగా వినాయక చవితి జరుపుకోవాలని కోరారు. పల్లె పల్లె లో పండుగ వాతావరణం నింపేలా, యువతలో ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టామని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. ఇది ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఈ ఏడాది తుమ్మలగుంటలో నెమలి ఈకలతో సరికొత్త అవతారంలో, ఆకర్షణీయంగా 3ఖ అడుగుల వినాయకుని ప్రతిమను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి హిందువు జరుపుకునే తొలి పండుగ వినాయక చవితి.. హిందూ ధర్మం పెంపొందేలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలోనే చంద్రగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. హిందూ ధర్మం పెంచి పోషిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ , మోహిత్ రెడ్డిలకు శ్రీ వారు, వినాయక స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. చెవిరెడ్డి చేపడుతున్న కార్యక్రమాలలో ఎవరూ సాటిరారని కితాబిచ్చారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా 1.15 లక్షల మట్టి విగ్రహాలను అందించడం ఏ ఒక్కరూ చేయలేనిది.. అది కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. ప్రతి ఇంటికి వినాయక ప్రతిమను అందించడం బృహత్తర కార్యక్రమమని, వినాయక విగ్రహాల తయారీ, పంపిణీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చొరవను అభినందించారు. యువతలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందేలా చేపట్టిన విధానాన్ని ప్రశంసించారు. భక్తితతత్వంలో చెవిరెడ్డి బాహుబలి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భక్తితతత్వంలో బాహుబలి అని తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ కొనియాడిరది. 1060 విగ్రహాల పంపిణీ, 1లక్షా 15 వేల మట్టి విగ్రహాల తయారీని వారు పరిశీలించారు. పల్లె పల్లెలో పండుగ వాతావరణం నెలకొల్పేందుకు చేపట్టిన వినాయక విగ్రహాల పంపిణీ ప్రక్రియను అభినందించారు. ప్రణాళికగా, సాంప్రదాయ బద్దంగా వినాయక విగ్రహాలు తయారీ, పంపిణీ చేపట్టడం అత్యంత ప్రాధాన్యమైందని పేర్కొన్నారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ శ్రీ విద్యా గణపతి నాయుడు, తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, నవీన్ కుమార్ రెడ్డి, మంగాటి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విగ్రహాలను తీసుకెళ్లేందుకు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.