పర్యావరణ పరిరక్షణ మన విధానం కావాలి

ఒక్కో విద్యార్తి ఒక్కో మొక్క నాటాలి: హరీష్‌ రావు

ప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్బంగా మొక్కను నాటుతున్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేట,జూన్‌5(ఇయ్యాల తెలంగాణ):  భూమండలంలో అన్నిటికంటే విలువైనది ప్రకృతి అని..జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యావరణంపై ఆధారపడి ఉందని మంత్రి హరీష్‌ రావు అన్నారు.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు ప్రజలకు సందేశాన్నిఇచ్చారు. మొక్కు లేకపోతే మానవ మనుగడనే ప్రశ్నార్ధకం అవుతుందని హరీశ్‌ రావు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు  ఎన్నో ప్రకృతి పై దృష్టి  పెడుతున్నాయని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి..వాటిని  సంరక్షించాలని  కోరారు. చెట్లను నాటడం వాటిని సంరక్షించడం ఉద్యమ తరహాలో చేపట్టాలని సూచించారు. ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత..130 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశం చెట్లను నాటి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి విూద ఉందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సహజ వనరుల  పరిరక్షణ ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. కాలుష్యం బాగా పెరిగి కొత్త కొత్త వ్యాధులు, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు.కాలుష్యాన్ని నియంత్రించేందుకు..చెట్లను పెంచడం..అడవులను సంరక్షించడం.. ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించాలన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో  ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ప్రకృతి, పర్యావరణంపై బోధించాలని ప్రతి ఒక్క విద్యార్థితో మొక్క నాటించాలని పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....