పంజాగుట్ట Police Station లో Staff మొత్తం బదిలీ

హైదరాబాద్‌, జనవరి 31 (ఇయ్యాల తెలంగాణ) : పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ లో పనిచేస్తున్న పోలీసులందరిని మూకుమ్మడిగా బదిలీ చేసారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ఎస్హెచ్వో, ఎస్సైలు,  కానిస్టేబుల్స్‌, హోమ్‌ గార్డ్స్‌ ల వరకు మొత్తం సిబ్బంది ని బదిలీ చేసారు. అక్కడ పనిచేస్తున్న మొత్తం 85 మందిపై బదిలీవేటు పడిరది. వారిని అర్ముడు రిజర్వ్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఒక పోలీస్‌ స్టేషన్లో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారు.  బదిలీలతో పంజాగుట్ట పీఎస్‌ ఖాళీ అవడంతో..ఇతర స్టేషన్ల నుంచి 82 మంది కొత్త సిబ్బందిని నియమించారు. పంజాగుట్ట పోలీసులపై ముందు నుంచీ పలు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. . బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడి వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలు బయటకు పొక్కడంపై హైదరాబాద్‌ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ఇనస్పెక్టర్‌ దుర్గారావు పై కేసు నమోదు కావడం అయన పరారీలో వుండడం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....