న్యాయవాదులకు హెల్త్‌ కార్డుల పంపిణీ

 
సంగారెడ్డి ఆగష్టు 8, (ఇయ్యాల తెలంగాణ ): సంగారెడ్డి పట్టణంలోని జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులకు సంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి హెల్త్‌ కార్డులు పంపిణీ చేసారు. విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే న్యాయవాదులు కూడా హెల్త్‌ కార్డులు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో న్యాయవాదులకు హెల్త్‌ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు  సంగారెడ్డి జిల్లా కోర్టులో సుమారు 500 పైగా న్యాయవాదులు పనిచేస్తున్నారని అందులో 379 మంది హెల్త్‌ కార్డులు మంజూరు అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదులకే కాకుండా వారి తల్లిదండ్రులకు పిల్లలు కూడా వర్తించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ  కృష్ణ,వైస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌, కార్యదర్శి బాలరాజ్‌, సంఘ నాయకులు దయాకర్‌ రెడ్డి, మాణిక్‌ రెడ్డి, సురేందర్‌, అరుణ కుమారి, రామ్‌ రెడ్డి ,ఆ రామ్‌ రెడ్డి, ఓ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....