నేడే విశ్వకర్మ Jayanthi ఉత్సవాలు

నేడే విశ్వకర్మ జయంతి ఉత్సవాలు  –బుర్రా వెంకటేశం, బి.సి.వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

హైదరాబాద్‌,సెప్టెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : ఈ నెల 17వ తేదీన విరాట్‌ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తగా 33 జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు బీ.సీ.సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రావెంకటేశం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి ఉత్సవ పండుగను అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారని చెప్పారు. అన్ని జిల్లా కలెక్టరు కార్యాలయాల్లో, జిల్లా బీ.సీ. సంక్షేమాధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. హైదరాబాదులో ఉప్పల్‌ భగాయత్‌ లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం మరియు వెల్ఫేర్‌  ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఇందులో వేలాది మంది విశ్వకర్మీయులు పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ ను సచివాలయంలోని తన కార్యాలయంలో బుర్రావెంకటేశం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడవిూ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, కార్యదర్శి నామోజు బాలాచారి, భవన ట్రస్టు ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్‌ లు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....