నేడు Inter National మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం !

ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 26నఅంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్పడు దుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశ్యం.

ప్రపంచవ్యాప్తంగా ది యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యూఎన్‌ఓడిసి) ఈ రోజున మత్తు పదార్ధాల వల్ల ఏర్పడే సమస్యల పట్ల చైతన్యం కోసం అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ డిసెంబర్‌ 7, 1987న చేసిన తీర్మానం 42/112 ద్వారా ప్రతి సంవత్సరం జూన్‌ 26వ తేదీని అంతర్జాతీయ మత్తు పదార్ధాల వ్యతిరేక దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఈ తీర్మానం 1987 ఇంటర్నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ ఆన్‌ డ్రగ్‌ అబ్యూస్‌ అండ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫికింగ్‌ నివేదిక ఇతర అంశాల పై మరికొన్ని చర్యల కోసం సిఫార్సు చేసింది.

1987 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశ దేశాల ప్రభుత్వాలను ఈ మహమ్మారి వ్యాప్తి గురించి హెచ్చరిస్తోంది. మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రపంచమంతటా కార్యక్రమాలు జరుపుకోడానికి జూన్‌26వ తేదీన ఐరాస సర్వప్రతినిధి సభ 1987లో మొట్టమొదటిసారిగా తీర్మానించింది. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు గాను ప్రమాణం చేసే లక్ష్యంతో జూన్‌26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా ఐరాస ప్రకటించింది. ప్రతి ఏటా జూన్‌26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాలను స్వాధీనపర్చుకుని దేశ దేశాల్లో బహిరంగంగా వాటిని తగులబెట్టడం, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపర్చడం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం వంటి చర్యలను పెద్ద ఎత్తున ఐరాస ప్రోత్సహిస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....