దోమ చిన్నదే కానీ..దాని కాటుతో ఏటా లక్షలాది మరణాలు !
మల, అరియా అనే రెండు ఇటాలియన్ పదాల కలయికతో మలేరియా అనే పదం పుట్టింది. దీనికి చెడ్డగాలి అనే అర్థం వస్తుంది. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రాన్ని సర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త ఈ రోజునే కనుగొన్నారు. దీంతో ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. రోనాల్డ్‌రాస్.. మలేరియా పరాన్న జీవికి ప్లాస్మోడియం అని పేరు పెట్టారు. దోమ మనిషిని కుట్టినపుడు మలేరియా పరాన్నజీవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రిమి స్పోరో జాయిట్స్గా మారుతుంది. అవి విూరో జాయిట్స్గా మారి కాలేయం, ఎర్రరక్త కణాలలోకి ప్రవేశిస్తాయి. విూరోజాయిట్స్ దశలో మలేరియా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.వేపనూనెతో దోమలను ఇలా తరిమికొట్టండి…వేపనూనె, కొబ్బరి నూనెను సమపాళ్లల్లో తీసుకొని పడుకునే ముందు శరీరానికి అప్లై చేసుకోవాలి. అలా చేస్తే దాదాపు ఎనిమిది గంటల పాటు వేపనూనె ప్రభావంతో దోమలు విూ దరిచేరకుండా ఉంటాయి.దోమలను తరిమికొట్టేందుకు సహజపద్ధతులను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేపనూనె దోమల పాలిట శత్రువు, మస్కిటో కాయిల్స్, స్ప్రేల బదులు వేపనూనెను వాడితే దోమలను నివారణ సహజ పద్ధతులతోనే సాధ్యం అవుతుందని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు.
అయితే వేపనూనెను దోమల నియంత్రణకు ఎలా వాడాలో చూద్దాం. ముందుగా వేపనూనె, కొబ్బరి నూనెను సమపాళ్లల్లో తీసుకొని పడుకునే ముందు శరీరానికి అప్లై చేసుకోవాలి. అలా చేస్తే దాదాపు ఎనిమిది గంటల పాటు వేపనూనె ప్రభావంతో దోమలు విూ దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా వేపనూనే శరీరానికి ఎలాంటి హానీ కలిగించదు. అలాగే వేప నూనె ప్రభావంతో దోమలు ఆ ప్రదేశం నుంచి దూరమవుతాయ. అయితే ఈ విషయాన్ని ప్రముఖ జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించడం విశేషం.అంతేకాదు వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాండీ ప్రోటోజోల్ గుణాలు ఉన్నాయి. అలాగే వేపనూనెలో కాస్త దూదిని ముంచి ఇంట్లోని ప్రతి గదిలో నాలుగు మూలలా పెడితే దోమలు ఆ గదిలోకి రావు. అలాగే నిలువఉన్న నీళ్లలో వేపనూనెను చల్లితే దోమలు వృద్ధిని అరికట్టవచ్చు.

.jpg)
