నేడు పాఠశాలల భద్రత మరియు Health day !

 

తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ఓ పాఠశాల లో అగ్ని ప్రమాదం సంభవిం చి 58 మంది విద్యార్థులు చని పోయారు. అప్పట్లో ఈ ఘట న దేశవ్యాప్తంగా అనేక విమర్శలకు తావిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరుసటి సంవత్సరం నుంచి జూలై 17న పాఠశాలల్లో భద్రత, ఆరోగ్య దినోత్సవం నిర్వహించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈరోజున విద్యార్థులకు   అప్రమత్తత, ఆరోగ్యం, మధ్యా హ్న భోజనం, పాఠశాల భవనాలపై అవగాహన కల్పిస్తారు. ఆనారోగ్యం బారిన పడకుండా విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు జవహర్‌ బాల ఆరోగ్య రక్ష పథకం పేరుతో ఆరోగ్య భద్రత కల్పించింది. ఈ పథకం కింద  పిల్లలను పాఠశాలలో వైద్యులు పరిక్షించి అవసరమైన వారికి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవడం ముఖ్య ఉద్దేశం. అనేక పాఠశాలల్లో మొక్కుబడిగా ఈ పథకం కొనసాగుతుంది. కొన్ని చోట్ల వైద్య పరీక్షలే నిర్వహించడం లేదు. అలాగే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈవ్‌ టీజింగ్‌ గురికాకుండా చూడడమనేది పాఠశాలల బాధ్యత. కులం, మతం పరంగా వేధింపులకు గురికాకుండా చూడాలి.  బడి బస్సులు భద్రమేనా?… ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రతి ఏటా వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా బస్సుల విషయంలో నిబంధనలు పాటించడం లేదు. ప్రతి పాఠశాల బస్సు మే 15 లోగా ఆర్టీఓ అధికారుల దగ్గరికి తెచ్చి ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం తీసుకోవాలి. బస్సు వేగంగా వెళ్లకుండా  నిరోధకాలు బిగించాలి. పాఠశాలల బస్సులను గుర్తించే విధంగా పచ్చని రంగు వేయాలి. బస్సులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. పిల్లలను దించేందుకు ఒక సహాయకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. డ్రైవర్‌ పేరిట ఆరోగ్యకార్డు ఉండాలి.  3 నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించి అందులో రాయాలి. వాహనం నడిపే డ్రైవ ర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కిటికిల చుట్టూ గ్రిల్‌ ఉండాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....