నేడు గొప్ప సంఘ సంస్కర్త గురజాడ జయంతి

సెప్టెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ ): గురజాడ అప్పారావు ప్రముఖ రచయిత, గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. గానూ భావించే ఆ రోజుల్లో అతను ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉందిగురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్‌ 21 అప్పారావు జన్మించాడు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు . 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్‌ 30 న గురజాడ అప్పారావు మరణించాడు.గురజాడ యొక్క ముఖ్య వ్యాఖ్యలు అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోయ్‌ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది.ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌.ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు ఛేంజ్‌ చేసుకోకపోతే పొలీటీయన్‌ కానేరడోయ్‌.చెట్టపట్టాల్‌ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయితిండికలిగితే కండ కలదోయ్‌..కండ కలవాడేను మనిషోయ్‌.దేశమనియెడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలెనోయ్‌.పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదుమందగించక ముందు అడుగేయి, వెనుకపడితే వెనెకోనోయ్‌మతం వేరైతేను యేమోయ్‌, మనసు వొకటై మనుషులుంటేమనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.వట్టిమాటలు కట్టి పెట్టోయ్‌, గట్టి మేలు తలపెట్టోయ్‌వ్యర్థ కలహం పెంచబోకోయ్‌ కత్తి వైరం కాల్చవోయ్‌సొంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి సాయపడవోయిఅందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ వుంటుంది.తిండికలిగితే కండ కలదోయ్‌..కండ కలవాడేను మనిషోయ్‌.ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌.గురజాడ పై చేసిన వ్యాఖ్యలు గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు“ దేవులపల్లి కృష్ణశాస్త్రికవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ “ శ్రీశ్రీ

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....