నేడు అంతర్జాతీయ పేదల దినోత్సవం

  జూన్ 27,(ఇయ్యాల తెలంగాణ ):ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. పేదల జీవితాలు మాత్రం మారలేదు. వీరి పరిస్థితిలో ఏ మార్పు కానరాలేదు. చాలీ చాలని ఆదాయం, కూడు, గూడు వంటి ఇతరత్రా సమస్యలతో జీవితాలను వెల్లదీస్తున్నారు. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ తదితర వసతులను పొందలేని పరిస్థితిని పేదరికం అనవచ్చు. మనిషి తీసుకునే పౌష్టికాహారం ఆధారంగా పేదరికాన్ని గుర్తించవచ్చు. రోజుకు 2,250 కేలరీల ఆహారాన్ని తీసుకోని వారిని పేదలుగా ప్రభుత్వం గుర్తించింది. పౌష్టికాహారం అందని వారిని పేదలుగా గుర్తించినట్లయితే మన దేశంలో కోట్లాది మంది పేదలు ఉన్నట్లు నిర్ధారించవచ్చు. ఎన్‌ఎస్‌ఎస్‌వో పేదరికపు అంచనాలప్రకారం 2011`12లో మొత్తం జనాభాలో 21.9 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇందులో గ్రావిూణ పేదల శాతం 25.7, పట్టణ పేదల శాతం 13.7. కామన్వెల్త్‌ కామన్‌ హంగర్‌ అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సరైన తిండి, పౌష్టికాహారం లభించని కారణంగా బరువు తక్కువగా పుడుతున్న పిల్లల్లో అత్యధిక శాతం భారత్‌లోనే ఉన్నారని తేలింది.దేశంలోని పిల్లల్లో 43శాతం బరువు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.5సంత్సరాల లోపు పిల్లలు 7కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని సేవ్‌ చిల్డ్రన్‌ అనే సంస్థ నివేదిక ద్వారా తెలుస్తుంది. ఆకలితో అలమటించే వారు అత్యధికంగా ఉన్న ప్రపంచంలోని 88 దేశాలలో మన దేశానిది 66వ స్థానం. అయితే ప్రభుత్వాలు వీటికి సమ్మతించకుండా దేశంలో పిల్లలందరికీ వివిధ పథకాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని సొంత డబ్బాలు కొడుతున్నాయి. పౌష్టికాహారం అందకపోవడంతో గ్రావిూణ ప్రాంతాలలోని పిల్లలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అనేక సర్వేలు చెపుతున్నాయి. కాగా 2011లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) మన దేశంలో 53.7శాతం లేదా 61.2కోట్ల మంది పేదలు ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రకారం మన దేశంలోనే పేదలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే మన ప్రభుత్వాలు పేదరికాన్ని తక్కువగా చూపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేయని వారు స్వంత భూమి, ద్విచక్రవాహనం, విద్యుత్‌ కనెక్షను లేనివారు పేదలుగా గుర్తింపబడు తున్నారు. తెలుపు రంగు రేషన్‌కార్డు ఉన్న వారు దారిద్య్రరేఖకు దిగువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిస్తున్నా ఇప్పటికీ రేషన్‌కార్డు లేని వారు అనేక మంది ఉన్నారు. 1947లో మన దేశానికి స్వాతత్య్రం వచ్చినపుడు దేశ జనాభా 34కోట్లు. అయితే ప్రస్తుతం మన దేశంలో పేదలు అప్పటి జనాభా కంటే ఎక్కువగానే ఉన్నట్టు ఓ సర్వే చెపుతుంది. మరో సర్వే ప్రకారం దేశంలో కోటీశ్వరుల సంఖ్య నానాటికీ పెరిగి పోతుండ గా పేదలు మాత్రం పేదలు గానే మిగిలి పోతున్నారన్నయీ  వాస్తవాలు ఆందోళనలు కలిగిస్తున్న  యీ 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....