న్యూ ఢిల్లీ, మార్చి 29 (ఇయ్యాల తెలంగాణ) : నేటీ బీసీల మహాధర్నాను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ పేర్కొన్నారు. చట్ట సభల్లో బీసీ బిల్లుతో పాటు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరగబోవు మహా ధర్నాకు అన్ని రాష్ట్రాల నుండి బీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ సోమవారం డీల్లీ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీల ఆవశ్యకతను తెలియజేప్పే మెమొరాండంను పలు పార్టీల ప్రతినిధులకు సోమవారం అందజేసి మంగళవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వనించినట్లు తెలిపారు.
ఇట్టి మహ ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హజరౌవుతున్నారని తెలిపారు. బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న కేంద్రంతో ఏంత వరకైనా పోరాటం చేస్తామని దాసు సురేష్ హెచ్చరించారు. బీసిల తల రాతను మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేంత వరకు అన్ని పార్టీల బీసీ ఎంపిలను కలుపుకొని ఉద్యమం చేస్తామన్నారు. అదే విధంగా 30వ తేదీ బీసీ ఎంపిలతో సమావేశం అవుతామని, 31న పేద్ద సంఖ్య లో బీసీలతో పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేపడతామని దాసు సురేష్ పేర్కొన్నారు.