నల్లగొండ, మార్చి 20 (ఇయ్యాల తెలంగాణ) : వైఎస్సార్ సీపీ ఎదుగుదలను ఓర్వలేకనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుంది అని వైఎస్సార్ సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో బాగంగా 30వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం మామిల్లపల్లీ గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆ గ్రామంలో అనేక మంది వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు. వారికీ పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు షర్మిల. అనంతరం అమె నిర్వహించిన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలతో బ్రహ్మ రధం పట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు షర్మిలకు మద్ధతు పలికారు. అనంతరం గుర్రాలదండీ, ముక్తానాయక్ తండా, జంపల్లీ, రేడ్డినాయక్, పోచర్లబోడు, చేన్నోలబావి, సిరివేణికుంటల మీదుగా బొల్లపల్లికి చేరింది.
అక్కడ మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ దుండగులు తమ కార్యకర్తపై దాడీ చేశారని షర్మిల ఆరోపించారు. తన కార్యకర్త మెడకు గాయపరచిన నిందితుని పై కేసు నమోదు చేసే వరకు రోడ్డు మీదే షర్మిల భైటాయించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తమ పార్టీ ప్రజల ఆదరణను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుందని అన్నారు. ఏ శక్తులు తెలంగాణా లో తమ పాదయాత్రను అడ్డుకోలేవని అన్నారు. దమ్ముంటే ఎన్నికల్లోఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కార్యక్రమం లో వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, మహ్మద్ అత్తార్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.